రామ్‌చరణ్ బర్త్‌‌ డే స్పెషల్‌.. ఫ్యాన్స్‌‌కు డ‌బుల్ బొనాంజా

by | Feb 11, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’.(Peddi) బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) , సుకుమార్‌ రైటింగ్స్‌ (Sukumar Writings) సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు (Venkata Sathish Kilaru) నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించ‌బోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, మార్చి 27న రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్స్‌తో అభిమానులను ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. నిజానికి ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజు నాడే ‘పెద్ది’ సినిమా విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కారణంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు.

ఇక ఇటీవలే రామ్ చరణ్ కు కవల పిల్లలు జన్మించడంతో మళ్ళీ అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. దాంతో ఈ సారి రామ్ చరణ్ పుట్టినరోజు వారికి మరింత ప్రత్యేకంగా నిలువనుంది. ఈ క్రమంలోనే చెర్రీ పుట్టినరోజు కానుకగా ‘పెద్ది’ సినిమా నుండి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ రానుందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ బర్త్ డే ముందు రోజైన మార్చి 26న శ్రీరామ నవమి పండగ వస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆ రోజున సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అవగా.. పుష్ప సిరీస్ మాదిరిగానే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకుడు సుకుమార్ శిష్యుడే కావడం విశేషం. అలా వరుసగా గురుశిష్యుల దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్. మరి ముందుగా వచ్చే శిష్యుని ‘పెద్ది’ ఏ రేంజ్ లో అలరిస్తుందో, ఆ తరువాత రాబోయే గురువు సుకుమార్ సినిమా ఏ తీరున మెప్పిస్తుందో చూడాలి.