రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్‌’ రికార్డ్స్.. ఇది క‌దా యశ్ రేంజ్!

by | Feb 10, 2026 | సినిమా

‘కేజీఎఫ్‌’ ఫ్రాంఛైజీ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్‌ (Yash). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. ఈ సినిమాలో కియారా అద్వానీ, న‌య‌న‌తార (Nayanathara) , రుక్మ‌ణీ వ‌సంత్ (Rukmini Vasanth) , హుమా ఖురేషి, తార సుతారియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహ‌న్ దాస్ (Geethu Mohan Das) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రం మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్ ద్వారా యష్ డిఫరెంట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇక కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. ఇప్పటికే ‘టాక్సిక్‌’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) భారీ మొత్తానికి దక్కించుకున్నారన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ‘టాక్సిక్’ (Toxic) థియేట్రికల్ రైట్స్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) సంస్థ రూ. 120 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘టాక్సిక్‌’ చిత్రానికి మరో క్రేజీ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఓవర్సీస్‌ ఇండియన్ లాంగ్వేజెస్ రైట్స్ రూ. 105 కోట్లకు కొనుగోలు చేశారని టాక్‌ నడుస్తోంది. దాంతో ఓవర్సీస్‌ రైట్స్‌ పరంగా అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం ఇదేనని చెబుతున్నారు. దీంతో యశ్ క్రేజ్‌ మరింత పెరిగిందని అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రముఖ ఓవర్సీస్‌ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దాంతో ఓవర్సీస్‌లోని భారత భాషల్లో ఫార్స్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇక మరోవైపు ఈ మూవీ టీజర్ విడుదల సమయంలో ‘టాక్సిక్’ (Toxic) పై వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌లోని కొన్ని బోల్డ్ సీన్స్ మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా మహిళా కమిషన్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయి