మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) అనే క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ముఖ్యంగా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విషయంలో మేకర్స్ స్పందించకపోవడం అభిమానులని టెన్షన్ పెడుతోంది. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇంకా చిత్రీకరణ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడం వంటి విషయాలు సినిమా వాయిదా పడుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒక క్రేజీ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా గ్లింప్స్‌తో (Glimpse) పాటు టైటిల్ (Title) ను కూడా అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు ఒకే సర్ప్రైజ్ కాకుండా.. డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్- త్రివిక్రమ్ (Trivikram) సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా మే 20న రానుందని తెలుస్తోంది. ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఆ పుస్తకంతో ఎన్టీఆర్ పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లలో కనిపించడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా వెల్లడించి యంగ్ టైగర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరవింద సమేత వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అటు డ్రాగన్ టైటిల్ గ్లింప్స్ ఇటు గాడ్ ఆఫ్ వార్ మూవీ అనౌన్స్మెంట్ ఈ రెండూ ఒకే రోజు రావడంతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయంగా కనిపిస్తోంది.

