చరణ్-సుక్కూ కాంబో రెడీ.. హీరోయిన్ ను సుకుమార్ ఫైనలైజ్ చేశాడా

by | Feb 10, 2026 | సినిమా

టాలీవుడ్ లో ‘రంగస్థలం’ సినిమాతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఆ తరువాత గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు. ముఖ్యంగా ‘పుష్ప-2’ చిత్రం ఏకంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రూపొందనుండగా.. ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప ఫ్రాంఛైజీ మాదిరిగానే ఇది కూడా రెండు భాగాలుగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వెల్లడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మార్చి నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఆసక్తికర టాక్ నడుస్తుంది. నిజానికి రంగస్థలం సినిమాలో కథానాయికగా మొదట అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను మధ్యలోనే తప్పించి ఆ స్థానంలో సమంతను ఎంపిక చేశారు. ఈ ఊహించని పరిణామంతో అనుపమ పరమేశ్వరన్‌ తీవ్ర నిరాశకు గురవ్వగా.. మరో సినిమాలో ఛాన్స్ ఇస్తానని సుకుమార్ (Sukumar) నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) తో సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారట. రామ్ చరణ్ (Ram Charan) పక్కన అనుపమ బాగుంటుంద‌ని, వారి జోడి చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని మేకర్స్ కూడా అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన కెరీర్‌లో విభిన్న చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తున్న అనుపమ (Anupama Parameswaran) ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మరి ఈసారైనా అనుపమకు దర్శకుడు సుకుమార్ అవకాశం ఇస్తాడా, లేకపోతే మరో అగ్ర కథానాయికను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరి వరకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.