దిగి వచ్చిన పాకిస్థాన్ ; 15 న భారత్ ((India) తో ప్రపంచ కప్ మ్యాచ్ యధాతదం
టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) లో భారత తో ఆడబోయే మ్యాచ్ ని పాకిస్థాన్ బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం బాంగ్లాదేశ్ అభ్యర్ధనను ఐసీసీ తిరస్కరించిందన్న ఒకే ఒక్క కారణంతో పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోవడం వాళ్ళ టీ20 ప్రపంచ కప్ లైవ్ టెలికాస్ట్ చేసే జియో హాట్ స్టార్ (Jio Hot Star) పాకిస్థాన్ పైన, ఐసీసీ పై లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు 10 సెకండ్ల ప్రకటనకు సుమారు 40 నుండి 55 లక్షలవరకు ఛార్జ్ చేస్తారు. పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే స్టార్ స్పోర్ట్స్ (Star Sports) కు సుమారు 250-300 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే ఐసీసీ పాకిస్థాన్ కు చెల్లించవలసిన 300 కోట్ల మొత్తాన్ని జియో హాట్ స్టార్ కు చెల్లిస్తుంది. అప్పుడు పాకిస్థాన్ కూడా ఆర్ధికంగా నష్టపోతుంది. పాకిస్థాన్ ఆడకపోతే టి 20 వరల్డ్ కప్ ఉనికి కే ప్రమాదం రావచ్చు. అంతే కాకుండా రేటింగ్స్ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది
ఈ నేపథ్యంలో పాక్ తో ఐసీసీ జరిపిన చర్చలు ఫలించాయి. అంతే కాకుండా బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, శ్రీలంక ప్రెసిడెంట్ తదితరులు పాకిస్థాన్ ప్రతినిధులతో మాట్లాడి క్రీడా స్ఫూర్తి ని కొనసాగించమంది పాక్ ను అభ్యర్ధించారు.
అనేక రకాల ఒత్తిళ్ల మధ్య పాకిస్థాన్ ప్రభుత్వం, పాక్ క్రికెట్ బోర్డు ను 15 వ తేదీన భారత్ తో కొలంబో లో జరిగే మ్యాచ్ లో ఆడమని ఆదేశించింది
అంతే కాకుండా ఐసీసీ షెడ్యూల్ ప్రకారం టి 20 ప్రపంచ కప్ (T20 World Cup) బరి లో దిగమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది

