T20 World Cup: ఐర్లాండ్ పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం

by | Feb 8, 2026 | క్రీడలు

T20 World Cup : శ్రీలంక, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 20 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది

T20 World Cup : మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Srilanka) 20 ఓవర్ల లో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది

ఓపెనర్లు  కమిల్ మిశార 14 పరుగులు,  నిశాంక 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పవన్ రత్నాయకే 5 పరుగులు, వెల్లగే 10 పరుగులు చేసి అవుట్ అవడంతో 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి శ్రీలంక జట్టు కష్టాల్లో పడింది.

అయితే ఆ తరవాత వచ్చిన కమిందు మెండిస్ తో జత కలిసిన కుషాల్ మెండిస్ ఐదవ వికెట్ కు 67 పరుగులు జోడించాడు. కమిందు మెండిస్ ధాటిగా ఆడి 19 బంతుల్లో 44 పరుగులు ( రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) చేశాడు. కెప్టెన్ శనక మొదటి బంతికే అవుట్ అయ్యాడు.

వన్ డౌన్ లో వచ్చిన కుషాల్ మెండిస్ 43 బంతుల్లో 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు

అనంతరం 164 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్ వికెట్ ను కోల్పోయింది. మొదటి నుండి తడబడుతూ ఆడిన స్టిర్లింగ్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అడయార్ షాట్ లు అడగా, మరో వైపు టెక్టర్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డు ను కదిలిస్తూ వచ్చారు.  23 బంతుల్లో 34 పరుగులు చేసిన అడయార్ హాసరంగా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన టెక్టర్, టక్కర్ లు ఆచి తూచి ఆడుతూ మూడవ వికెట్ కు 49 పరుగులు జోడించారు.  టెక్టర్ 40 పరుగులు, టక్కర్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాక, ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది.

చివరకు ఐర్లాండ్ (Ireland) 19.5 ఓవర్ల లో 143 పరుగులకు అల్ అవుట్ అయింది.  ఐర్లాండ్ జట్టు 30 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయింది

శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్లు తీక్షణ, హసరంగాలు చెరో మూడు వికెట్లు తీయగా, పేసర్ పతిరానా రెండు వికెట్లు తీసుకున్నాడు.  మరో స్పిన్నర్ వెల్లగె , పేసర్ చమీర లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు