పవన్- సురేందర్ రెడ్డి మూవీ.. హీరోయిన్‌గా ఎవరంటే?

by | Feb 8, 2026 | సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా దర్శకుడు సురేందర్ రెడ్డి (Surendar Reddy) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 32వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న‌ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం.. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో పవన్‌ కళ్యాణ్ ను ఇంతకుముందు చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. హై ఎనర్జీ యాక్షన్, గట్టి ఎమోషన్, కమర్షియల్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో కథానాయిక ఎంపికపై తాజాగా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ బ్యూటీ ఇమాన్వీ ఇస్మాయిల్‌ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం సమాచారం. ప్రభాస్‌తో ‘ఫౌజీ’లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వీ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో, సురేందర్ రెడ్డి లాంటి క్రేజీ దర్శకుడితో సినిమా అంటే ఇమాన్వీ కెరీర్‌లో కూడా ఇది ఒక కీలక టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. కాగా, ప్రముఖ రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి (Ram Thalluri) ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.