‘ఓన్లీ పర్సంటేజ్‌.. నో రెమ్యునరేషన్’ అంటున్న బన్నీ!

by | Feb 8, 2026 | సినిమా

‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. AA22xA6 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ తెరకెక్కించనుంది. ఈ మూవీ తర్వాత మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanaka Raj) దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రాన్ని చేయనున్నారు అల్లు అర్జున్. ఇదిలావుంటే.. రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్‌ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారని తెలుస్తోంది.

సాధారణంగా హీరోలు తమ మార్కెట్ కు అనుగుణంగా సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే ‘పుష్ప 2’ (Pushpa) నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) తన పారితోషకాన్ని పర్సంటేజ్‌ విధానంలో రూపంలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప 2 మూవీ బిజినెస్‌ మొత్తంపై 27 శాతం రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్‌ చేయగా అందులో అల్లు అర్జున్‌ తన వాటాగా 27 శాతం అంటే రూ.270 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నారని సమాచారం. ఇప్పడు అట్లీతో (Atlee) చేయనున్న AA22xA6 (AA22xA6) సినిమాకు కూడా ఆ మూవీ మొత్తం బిజినెస్‌పై 27 నుంచి 30 శాతం వరకు రెమ్యునరేషన్ అందుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా బిజినెస్‌పై పర్సంటేజ్‌ విధానంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అల్లు అర్జున్‌ ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చారు.