T20 World Cup : నెదర్లాండ్స్ పై చెమటోడ్చి గెలిచిన పాకిస్థాన్

by | Feb 7, 2026 | క్రీడలు

T 20 World Cup – Match 1 : టి 20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయ సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ (Netherlands) 19.5 ఓవర్లలో 147 పరుగులకు అల్ అవుట్ అయింది.

37 పరుగులు చేసిన  కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.  లీడ్ 30 పరుగులు, లెవిట్ 24 పరుగులు చేశారు.

పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు తీయగా, మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ లు రెండేసి వికెట్లు తీయగా, షహీన్ షా ఆఫ్రిది కి ఒక వికెట్ దక్కింది.

148 పరుగులు లక్ష్యానికి  పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.  148 పరుగుల లక్ష్యానికి 9 మంది Pak ఆటగాళ్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టేలా చేశారు నెదర్లాండ్స్ బౌలర్లు.

ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ 47 పరుగులు చేసి పాక్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో. కెప్టెన్ సల్మాన్ ఆఘా 12 పరుగులు, బాబర్ అజామ్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

మరో ఓపెనర్ సయిమ్ అయూబ్ 13 బంతుల్లో 24 పరుగులు చివర్లో ఫహీమ్ అష్రాఫ్ 11 బంతుల్లో 29 పరుగులు చేయడం తో పాక్ 19.3 ఓవర్లకు 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.  ఫహీమ్ అష్రాఫ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మరో 15-20 పరుగులు చేసి ఉంటే నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ గెలిచేది.  అయితే పాకిస్థాన్ (Pakisthan) ను ప్రతిఘటించిన తీరు ఆకట్టుకుంది అని చెప్పవచ్చు