Under19 World Cup : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టు పై భారత జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్ 19 ప్రపంచ కప్ లోఆరో సారి ఫైనల్ కి వచ్చిన భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడం ఇది ఆరోసారి
మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వైభవ్ సూర్యవంశి విధ్వంసం (Vaibhav Surya Vamsi)
వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అయితే వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే తో కలిసి రెండవ వికెట్ కు 142 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, వేదాంత్ తో వైభవ్ సూర్యవంశీ మూడవ వికెట్ కు 89 పరుగులు జోడించాడు. వేదాంత్ 32 పరుగులు చేశాడు. 175 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశి 26 ఓవర్లోనే మూడవ వికెట్ గా వెను తిరిగాడు
అయితే గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆరోన్ జార్జి 9 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, ఆ తరవాత వచ్చిన, విహాన్ 30 పరుగులు, అభిగ్యాన్ కుందు 40 పరుగులు, కనిష్క్ చౌహన్ 37 పరుగులు చేసి భారత జట్టు 411 పరుగుల భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు
412 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఫాల్కనర్ 67 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఓపెనర్ డాకిన్స్ 66 పరుగులు, మయెస్ 45 పరుగులు చేశారు. సుమారు 10 ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టు అల్ అవుట్ అయ్యింది.
వైభవ్ సూర్య వంశి (Vaibhav Surya Vamsi) ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ అఫ్ ది సిరీస్ (Player of the Series) గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో వైభవ్ 439 పరుగులు చేశాడు


