ఇండస్ట్రీలో ‘బాలయ్యే’ టార్గెట్.. ఏకంగా ఆ నలుగురు డైరెక్టర్స్!

by | Feb 6, 2026 | సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK111) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ‘వీరసింహారెడ్డి’ని మించిన కథను గోపిచంద్ .. బాలయ్య కోసం రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మార్కో (Marco) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళ డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక హనీఫ్ తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఇటీవలే బాలయ్యను కలిసిన ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని కథ చెప్పగా బాలయ్య (Bala Krishna) వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచిన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్నారని తెలుస్తోంది. అలాగే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేస్తారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి’ సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కూడా బాలకృష్ణ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తారని సమాచారం. ఇక దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కూడ బాలకృష్ణతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. నిజానికి ఇండస్ట్రీలో బాలయ్యతో సినిమాలు చేసేందుకు దర్శకులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే బాలయ్య ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశారంటే షూటింగ్ టైమ్ లో ఏలాంటి మార్పులకు ఛాన్స్ ఇవ్వరు. అలాగే మేకింగ్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోరు. ఈ కారణంగానే బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తూంటారు డైరెక్టర్స్.