‘మెగా 158’ – చిరు మూవీలో ‘ధురంధ‌ర్’ హీరోయిన్!

by | Feb 5, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే జోష్ లో ఇప్పుడు చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ (Bobby) తో చేయనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా 158 సినిమాలో చిరంజీవి (Chiranjeevi) కుమార్తెగా ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్, ధురంధ‌ర్ (Durandhar) మూవీ హీరోయిన్ సారా అర్జున్ (Sara Arjun) పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండనుందని, ఇందు కోసం ఇప్పటికే సారా అర్జున్ తో చిత్రబృందం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిగురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుంది. కాగా, ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. చిరంజీవి కెరీర్‌లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.