రామ్ చరణ్ ‘పెద్ది’ ఎఫెక్ట్‌.. అఖిల్ ‘లెనిన్’ పోస్ట్ పోన్!

by | Feb 5, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) ప్రస్తుతం ‘లెనిన్‌’ (Lenin) సినిమాతో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మనం ఎంటర్‌ప్రైజెస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున (Nagarjuna) , సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. నిజానికి ఈ చిత్రాన్ని మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. అయితే ప్రస్తుత నేపథ్యంలో ‘లెనిన్’ (Lenin) సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా మారాడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల పోటీని నివారించేందుకు ‘లెనిన్’ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలావుంటే.. లెనిన్ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటికొచ్చింది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో అఖిల్‌ (Akhil) యాభైఏళ్ల వ్యక్తిగా సరికొత్త లుక్‌తో కనిపిస్తారట. సినిమాలో ఈ సీక్వెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మేకర్స్‌ అంటున్నారు.