‘దేవర 2’ – ఆలస్యమైనా బాక్సాఫీస్ వద్ద ఆరాచకమే!

by | Feb 5, 2026 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దేవర 2’ (Devara) సినిమా కూడా ఉండటం అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) రూపొందించిన ‘దేవర’ తొలి భాగం సూపర్ హిట్ కావడంతో, రెండో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలంగా ‘దేవర 2’పై అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? దేవర 2 సెట్స్ మీదకి వెళ్తుందా ? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిర్మాత మిక్కిలినేని సుధాకర్ దేవర 2 పై క్లారిటీ ఇస్తూ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మే నెల నుంచే ప్రారంభం కానుందని ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దేవర 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారట. ప్రస్తుతం దర్శకుడు కొరటాల సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 (Devara) కోసం కొరటాల శివ స్క్రిప్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేవలం దక్షిణాది అభిమానులే కాకుండా పాన్ ఇండియా రేంజులో ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా కథలో స్వల్ప మార్పులు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని మెప్పించేలా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ‘దేవర-2’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) తనదైన నటనతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సాధిస్తారో చూడాలి.