పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ (Michael Jackson) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘మైఖేల్’.(Michael) ఇందులో మైకేల్ జాక్సన్‌గా ఆయన మేనల్లుడు జాఫర్ కనిపించనున్నారు. ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైకేల్ చిన్నతనంలో పడిన కష్టాలను ఎదుర్కొంటూ సూపర్‌స్టార్‌గా ఎలా మారారు అనేది ఈ మూవీలో చూపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ (Trailer) ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ అలరించాడు. ట్రైలర్‌లో జాఫర్ అచ్చు మైకేల్ లాగే కనిపిస్తున్నారు. మైకేల్ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆ గ్రేస్ జాఫర్ అద్భుతంగా పట్టుకున్నారు. తన మామ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేలా జాఫర్ నటన ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. పాటలు, డ్యాన్సులు అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి
కాగా, ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ రూ. 10 వేల కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 500 కోట్లకు పైగానే అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో కోల్మన్ డొమింగో, నియా లాంగ్ మైఖేల్ తల్లిదండ్రులుగా నటించగా, మైల్స్ టెల్లర్ కీలకమైన మేనేజర్ పాత్రలో కనిపించనున్నారు. తౌరా హరియర్, జులియానో వల్ది కీలక పాత్రల్లో నటించారు.

