ధురంధర్ 2’ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ అటు థియేటర్లతో పాటుగా ఇటు ఓటీటీలో కూడా అద్భుత విజయాన్ని సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా ‘ధురంధర్ 2’. దురంధర్ 2 ది రివెంజ్ టీజర్ ను మేకర్స్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలోను విడుదల చేశారు
టీజర్ చివరలో ఇది నూతన భారత దేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది. దెబ్బ కొట్టి తీరుతుంది అనే సంభాషణలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి.
జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ స్పై ఎంటర్టైనర్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి అగ్ర తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ధురంధర్ 2’ సినిమాను ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

