‘మార్కో’ డైరెక్టర్-బాలకృష్ణ మూవీ.. వైలెంట్ కాంబో ఆన్‌ ది వే.!

by | Feb 2, 2026 | సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ప్రస్తుతం తన 111వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK111) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. ‘వీరసింహారెడ్డి’ని మించిన కథను గోపిచంద్ .. బాలయ్య కోసం రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే బాలయ్య మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మార్కో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని భాషల్లో విడుదలైన మార్కో (Marco) మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం హనీఫ్ అదేని తెలుగులో బాలకృష్ణ (Bala Krishna) కోసం అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇటీవలే బాలయ్యను కలిసి కథ వినిపించగా వెంటనే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్ మీద దిల్ రాజు (Dil Raju) పాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నారని సమాచారం.

మార్కో సినిమాలో రక్తపాతం ఏ రేంజులో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు హనీఫ్ అదేని.. బాలకృష్ణతో అంతకు మించి రక్తపాతాన్ని సృష్టించబోతున్నాడట. ఇక ఈ సినిమాను గోపీచంద్ (Gopi Chand) మలినేని సినిమా ముగిశాక మొదలెట్టాలని బాలకృష్ణ (Bala Krishna) ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.