టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో #AA23 (AA23) వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తో అల్లు అర్జున్ సినిమా అంటే సహజంగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా, ఈ చిత్రంలో సూపర్ హీరో తరహా పాత్ర చేయనున్నారట అల్లు అర్జున్. ఇందులో ‘ఐరన్ హ్యాండ్’తో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుందనున్న ఈ మూవీకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇందులో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కథని శ్రద్ధా కపూర్‌కి (Shraddha Kapoor) చెప్పగా, ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. శ్రద్ధా కపూర్, అల్లు అర్జున్ (Allu Arjun) పక్కన బాగుంటుందని, వారి జోడి చూడముచ్చటగా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా, ఇటీవల ‘స్త్రీ 2’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

