మొత్తానికి మహేష్ ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్.!

by | Jan 29, 2026 | సినిమా

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారణాసి’ (Varanasi) . భారత సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆశయంతో రాజమౌళి (Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు, విడుదల ఏడాదిని కూడా మేకర్స్ వెల్లడించారు. అప్పటి నుంచి ‘వారణాసి’కి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన ఓ కీలక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న విడుదల చేయనున్నట్లు కొన్ని hoardings వారణాసిలో ప్రత్యక్షమయ్యా యి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ hoardings లో ఉన్నదే సినిమా విడుదల తేదీ అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కాగా, అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘వారణాసి’ని (Varanasi) రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ విషయానికొస్తే.. ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే కోకాపేటలో భారీ వ్యయంతో వారణాసి సెట్‌ను రూపొందించారట. ప్రస్తుతం ఇక్కడే మహేష్ బాబుతో (Mahesh Babu) పాటుగా ఇతర తారాగణం పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.