యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో ‘వీడీ14’ (VD14) వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘టాక్సీవాలా’తో విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రిటీష్ పాలన కాలాన్ని నేపథ్యంగా తీసుకుని, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్న తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘రణబలి’ (Ranabali) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. స్టోరీ బ్యాగ్డ్రాప్ కు ఈ టైటిల్ అయితేనే సరిగ్గా ఉంటుందని దర్శకుడు రాహుల్ భావిస్తున్నారట. కాగా, ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మీక మందన్న (Rashmika Mandana) కథానాయికగా నటిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరి జోడీ మూడోసారి తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్-అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

