మూడవ టి 20 : భారత జట్టు లక్ష్యం 154 పరుగులు

by | Jan 25, 2026 | సినిమా

భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడవ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది

34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును ఫిలిప్స్, చాప్ మన్ లు ఆదుకున్నారు.  వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 52 పరుగులు జోడించారు. చాప్ మన్ 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు.  అంతకు ముందు ఓపెనర్ కాన్వే ఒక పరుగు చేసి అవుట్ అవగా, రవీంద్ర 4 పరుగులు, సీఫెర్ట్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేసిన ఫిలిప్స్ టాప్ స్కోరర్. కెప్టెన్ సాంట్నర్ 27 పరుగులు చేశాడు

భారత జట్టు బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, హార్దిక్ పాండ్య, బిష్ణోయ్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్షిత్ రానా కు  ఒక వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్ కూడా గెలిచి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకుకోవాలన్న పట్టుదలతో భారత జట్టు ఉంది.