విజయ్ దేవరకొండ ‘వీడీ 14’ టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే?

by | Jan 24, 2026 | సినిమా

టాలీవుడ్ లో ‘టాక్సీవాలా (Taxiwal) ’ వంటి సూపర్ హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devara Konda) , డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో ‘VD15’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా పీరియాడికల్, హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మీక మందన్న (Rashmika Mandana) నటిస్తుండగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ అందించారు మేకర్స్.

ఈ మూవీ టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు విడుదలయ్యే ఈ టైటిల్, ఫస్ట్ లుక్ లతో సినిమాపై అంచనాలు మరింత పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, విజయ్ దేవరకొండ గత చిత్రం ‘కింగ్డమ్’ (Kingdom) కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించిన సంగతి తెలిసిందే. కమర్షియల్‌గా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చూస్తున్నాడు.