‘రాజా సాబ్’ ఓటీటీ డీల్‌… మరీ అంత త‌క్కువ‌నా?

by | Jan 24, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా మొదటి షో నుండే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌పై తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంటుందనే టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కేవలం రూ.80 కోట్లకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ జియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ (Prabhas) గత సినిమాలు కల్కి, సలార్‌ (Salar) తో పోల్చితే చాలా తక్కువ ధరకు రాజాసాబ్‌ ఓటీటీ డీల్ జరిగిందని చెప్పొచ్చు. కాగా, రొమాంటిక్‌ కామెడీ హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. కాగా, మరోవైపు రాజాసాబ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తమ సినిమాను లక్ష్యంగా చేసుకుని అవమానపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.సోషల్ మీడియాలో తన సినిమాను, అందులోని నటీనటులను కావాలని అవమానకరమైన, పోస్టులు పెడుతున్నారని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.