‘శంకరవరప్రసాద్‌గారు’కు ఊహించని షాకిచ్చిన హైకోర్ట్!

by | Jan 24, 2026 | సినిమా

మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu) మూవీతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టాడు మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) . అనిల్‌ రావిపూడి (Anil RavipudI) దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఈ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రభుత్వం అనుమతించిన అదనపు టికెట్ ధరల ద్వారా వసూలైన సుమారు రూ. 42 కోట్లను వెంటనే రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు (High Court) ఆ రూ. 42 కోట్ల వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే అందజేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా వాణిజ్య పన్నుల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోల సినిమాలు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచడం సర్వసాధారణం అయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలు విడుదల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న పిటిషన్‌పై విచారణ చేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.