‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. (Ustad Bhagath Singh) ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల రిలీజైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ప్రస్తుతం ఒక అప్‌డేట్ వైరలవుతుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 27న లేదా ఏప్రిల్ 23 వ తేదీల్లో ఏదో ఒక డేట్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది (Peddi) ‘ మూవీ రిలీజ్ కానుండడంతో ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటి సినిమా తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagath Singh) రానుండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, వంశీ, అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

