T20 : అభిషేక్ శర్మ విధ్వంసం ; భారత జట్టు 238 పరుగుల భారీ స్కోర్

by | Jan 21, 2026 | వార్తలు

India Vs New Zealand 1st T20 : భారత, న్యూజిలాండ్ జట్ల  మధ్య నాగపూర్ లో  జరుగుతోన్న మొదటి టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.

భారత జట్టు ఇన్నింగ్స్ రెండవ ఓవర్లోనే ఓపెనర్ సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది.  సంజు శాంసన్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లు ఆదుకున్నారు.  వీరిద్దరూ మూడవ వికెట్ కు 99 పరుగులు జోడించారు

22 బంతుల్లో 32 పరుగులు చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తరవాత వచ్చిన హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 25 పరుగులు చేయగా, శివమ్ దూబే 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆట హైలైట్. అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు.  అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్సర్లు ఐదు ఫోర్లు ఉన్నాయి.  చివర్లో రింకు సింగ్ ఆట హైలైట్ అని చెప్పవచ్చు. రింకు సింగ్ (Rinku Sharma) 20 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. రింకు సింగ్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి

డరిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 20 వ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి 

న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమిసన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. క్లార్క్, ఐష్ సోది, సాంట్నర్ లు తలా ఒక వికెట్ తీశారు

ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, వన్ డే సిరీస్ లను కోల్పోయిన భారత జట్టు టి 20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది