ఈ వారాంతంలో రెండు సూపర్ హిట్ సినిమాలు తెలివిజన్ ప్రీమియర్ లు గా మన ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి పండకకు థియేటర్ లో సినిమాలు చూసిన తరవాత, ఇప్పుడు టెలివిజన్ లో ప్రీమియర్ ల పండగ కు ప్రేక్షకులను సిద్ధం చేస్తున్నారు బ్రాడ్ కాస్టర్ లు.
అక్టోబర్ 2, 2025 న విడుదలైన కాంతారా చాప్టర్ 1 (Kanthara Chapter 1 – World Television Premiere) సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కంటెంట్ పరంగా కాంతారా పోలిస్తే వెనుకబడిన కాంతారా చాప్టర్ 1, మేకింగ్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో వచ్చిన కాంతారా కు ప్రీక్వెల్. ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 ను జీ తెలుగు (Zee Telugu) లో ఈ శనివారం అంటే జనవరి 24 న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయనున్నారు.
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ మిరాయి (Mirai) సినిమాలో రితిక నాయక్, శ్రేయ చరణ్, మంచు మనోజ్ (Manchu Manoj) లు నటించగా, కెమరామెన్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ మొదటి వారంలో థియేటర్లలో సందడి చేసిన ఈ మిరాయి చిత్రం థియేటర్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మిరాయి చిత్రం కూడా ఈ వచ్చే ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా (Star Maa) లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయన్నునారు
ఇప్పటికే కాంతారా చాప్టర్ 1, మిరాయి చిత్రాలను థియేటర్ లోను, ఓ టి టి లోను చూసిన ప్రేక్షకులు టెలివిజన్ లో ఎలా ఆదరిస్తారో చూడాలి

