ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం కెరీర్‌లో బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు.
అయితే ‘నారీ నారీ నడుమ మురారి’తో థియేటర్లలో సందడి చేస్తూనే శర్వానంద్ రాబోయే సినిమాల లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బైకర్’ (Biker) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యువీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతుంది. ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందించగా.. ఈ వేసవి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు శర్వానంద్ (Sharwanand) హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోగి’ కూడా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 1960 నాటి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా ముగియగానే శర్వానంద్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్నట్లు శర్వానంద్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తున్న శర్వానంద్ కమిట్‌మెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

