ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఛాంపియన్’.?

by | Jan 18, 2026 | టీవీ & ఓటిటి

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. గతేడాది క్రిస్మస్ పండుగ కానుకగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఛాంపియన్’ కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా నమోదయ్యాయి. హీరో రోషన్ కెరీర్‌లోనే ఈ సినిమాకు బెస్ట్ కలెక్షన్స్ రావడం విశేషం. తెలంగాణలోని బైరాన్‌ పల్లి బ్యాగ్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్టు సినీ సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదిక‌గా జనవరి 23, 2026 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. అయితే దీనిపై మేక‌ర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్‌, జీకే మోహన్‌, జెమిని కిరణ్‌ నిర్మించారు. ఇందులో సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు.