మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కథాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది (Peddi)’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నది. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. పెద్ది సినిమాకు మేకర్స్ ఓటీటీ ప్లాన్ సెట్ చేశారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్‌ను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సినిమా దుమ్మురేపుతుండగా, థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అనే కుతూహలం సినీ వర్గాల్లో ఏర్పడింది.

