తెలుగు సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడంలో జీ తెలుగు జోరు చూపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల శాటిలైట్ హక్కులను జీ వారు దక్కించుకున్నారు
మొదటగా చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad garu) సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. జీ వారు ఏయే సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారో చూద్దాం.
- అఖండ 2 (Akhanda 2)
- జటాధర (Jatadhara)
- ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka)
- ఛాంపియన్ (Champion)
- శంబాలా (Shambala)
- మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad garu)
- భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Vignapti)
- అనగనగ ఒక రాజు (Anaganaga Oka Raju)
- నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari)
- జననాయకుడు (Jana Nayakudu)
అయితే స్టార్ మా (Star Maa) రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ చిత్ర శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. రవి తేజ మాస్ జాతర, ఎన్టీఆర్ దేవర చిత్ర హక్కులు కూడా స్టార్ మా వారి వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.
సుమ కొడుకు రాజీవ్ కనకాల నటించిన మోగ్లీ చిత్ర శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను మాత్రం ఈటీవీ (ETV) దక్కించుకుంది
అయితే జీ తెలుగు (Zee Telugu) కొన్న సినిమాలలో ఒక్క మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఒక్కటే పెద్ద సినిమా. స్టార్ మా వాళ్ళు ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలే కొంటారు. ఆ విషయంలో స్టార్ వాళ్ళు ఇప్పటికీ ముందే ఉన్నారు.

