దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ ; గ్లిమ్ప్స్ విడుదల

by | Jan 15, 2026 | సినిమా

బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జబర్దస్త్ వేణు తన కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ గ్లిమ్ప్స్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.  ఈ ఎల్లమ్మ చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు.  బలగం సినిమాను నిర్మిచిన దిల్ రాజు ఈ ఎల్లమ్మ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.

ఈ ఎల్లమ్మ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు, వేణు యెల్దండి  కాంబినేషన్ లో వస్తోన్న రెండవ సినిమా ఈ ‘ఎల్లమ్మ’

గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బలగం సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.  అప్పట్లో మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా దర్శకుడు వేణు ని అభినందించారు