మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. చిరంజీవి అభిమానులు, ఫామిలీ ఆడియన్స్ తో పాటు పెద్దవాళ్ళు థియేటర్ కి తరలి వస్తున్నారు. ఈ సంక్రాంతి ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు బెస్ట్ సంక్రాంతి అని చెప్పవచ్చు
మెగా స్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఈ సంక్రాంతి విన్నర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ ఎలెమెంట్స్ కు ఫామిలీ టచ్ ఇచ్చి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి కూడా సూపర్ హిట్ కొట్టాడు అని చెప్పవచ్చు.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మూడు రోజుల్లో 152 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడం పట్ల చిరంజీవి తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా వ్యక్త పరిచారు
నార్త్ అమెరికా లో కూడా మన శంకర వర ప్రసాద్ గారు సినిమా 2 మిలియన్స్ డాలర్స్ ని 3 మిలియన్ డాలర్స్ వైపు పరిగెడుతోంది. రాజకీయాలనుండి మళ్ళి సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి బెస్ట్ సినిమా ఇదే చిరంజీవి అభిమానులే కాక సగటు సినీ అభిమానులు కూడా చెబుతున్నారు
ఈ చిత్రం సూపర్ హిట్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ వెంకటేష్, చిరంజీవి, అనిల్ రావిపూడి ల చిట్ చాట్ వీడియో ఈ రోజు విడుదల చేయబోతున్నారు
రాజాసాబ్ తో మొదలైన సంక్రాంతి మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి చిత్రాలతో తెలుగు రాష్ట్రాలలో థియేటర్ లు కళకళలాడుతున్నాయి.

