ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపి వారియర్స్ ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ విమెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
యూపీ వారియర్స్ ఉమెన్ జట్టు ఓపెనర్ కిరణ్ నవగిరే డక్ అవుట్ అయ్యింది. కెప్టెన్ లానింగ్, లిచ్ ఫీల్డ్ లు రెండవ వికెట్ కు 47 పరుగులు జోడించారు. 27 పరుగులు చేసిన లిచ్ ఫీల్డ్ అవుట్ అయ్యాక, హర్లీన్ డియోల్, లానింగ్ లు మూడవ వికెట్ కు 85 పరుగులు జోడించారు. 38 బంతుల్లో 54 పరుగులు చేసిన లానింగ్ అవుట్ అయ్యిన తరవాత నుండి యూపీ వారియర్స్ ఉమెన్ వికెట్ల పతనం ప్రారంభమమయ్యింది
మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న యూపీ వారియర్స్ చివరకు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చివరి ఐదు వికెట్లు 13 పరుగులు చేసి కోల్పోయింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో కప్, షెఫాలీ వర్మ లు చెరో రెండు వికెట్ లు తీయగా శ్రీ చరణి, నందని శర్మ, స్నేహ రానా లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు
షెఫాలీ వర్మ 36 పరుగులు, లిజీలి 67 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్ లు గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. రోడ్రిగ్స్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యినా అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఖాయమైనది. లారా 25 పరుగులతో, కప్ 5 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు యూపీ వారియర్స్ బౌలర్ల లో దీప్తి శర్మ రెండు వికెట్లు, శోభన ఒక వికెట్ తీశారు

