ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premiere League) లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) నిర్ణీత 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
గుజరాత్ జెయింట్స్ 22 పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన కనిక అహుజా, మరో ఓపెనర్ బెత్ మూని తో రెండవ వికెట్ కు 42 పరుగులు జోడించారు
33 పరుగులు చేసిన బెత్ మూని అవుట్ అయిన తరవాత కెప్టెన్ గార్డనర్, అహుజా తో జత కలిసింది. అప్పటికే ధాటిగా ఆడుతోన్న అహుజా 18 బంతుల్లో 34 పరుగులు చేసింది. గార్డనర్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యింది.
అయితే చివర్లో వారెహామ్, ఫుల్మలీ లు ఆరవ వికెట్ కు 56 పరుగులు జోడించారు. వారెహామ్ 33 బంతుల్లో 43 పరుగులు, ఫుల్మలీ 15 బంతుల్లో 36 పరుగుల తో అజేయంగా నిలిచారు
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్లలో ఇస్మాయిల్, మాధ్యుస్, అమేలియా కెర్, నికోల క్యారీ లు తల ఒక వికెట్ తీసుకున్నారు. ఆయుషి సోని రిటైర్డ్ అవుట్ అయ్యింది.


