WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ (Gujarat Giants) , యూపీ వారియర్స్ (UP Warriors) విమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పోరాడి ఓడింది. గుజరాత్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది
208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూపీ వారియర్స్ మూడు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కిరణ్ నవిగెరె ఒక పరుగు చేసి అవుట్ అయింది. కెప్టెన్ లానింగ్, లిచ్ ఫీల్డ్ లు రెండవ వికెట్ కు 70 పరుగులు జోడించారు. 30 పరుగులు చేసిన లానింగ్ అవుట్ అయిన తరవాత యూపీ వారియర్స్ వెంట వెంటనే హర్లీన్ డియోల్, దీప్తి శర్మ ల వికెట్లను కోల్పోయింది.
74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో లిచ్ ఫీల్డ్ తో జత కలిసిన శ్వేతా సెహ్రావత్ ఐదవ వికెట్ కు 69 పరుగులు జోడించింది. 25 పరుగులు చేసిన శ్వేతా సెహ్రావత్ అవుట్ అయినా వెంటనే 40 బంతుల్లో 78 పరుగులు చేసిన లీచ్ ఫీల్డ్ కూడా అవుట్ అవడంతో యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది
ఆఖర్లో ఆశ శోభన ధాటిగా ఆడి 10 బంతుల్లో 27 పరుగులు చేసినా తనకు సహకారం అందించేవారు లేకపోవడంతో యూపీ వారియర్స్ విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
గుజరాత్ జెయింట్స్ బౌలర్ల లో రేణుక సింగ్, సోఫియా డివైన్, వారెహామ్ లు తలా రెండు వికెట్లు తీశారు. గార్డనర్, గైక్వాడ్ లు చెరో ఒక వికెట్ తీశారు.
10 బంతుల్లో 27 పరుగులు చేయడమే కాకుండా రెండు వికెట్లున్ తీసి అల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వారెహామ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 13 పరుగులు చేసి అవుట్ అయ్యింది మరో ఓపెనర్ సోఫీ డివైన్ ధాటిగా ఆడి 20 బంతుల్లోనే 38 పరుగులు చేసింది. 55 పరుగులకు ఓపెనర్లిద్దరిని కోల్పోయిన గుజరాత్ జెయింట్స్ ను కెప్టెన్ యాష్లే గార్డనర్, అనుష్క శర్మ లు మూడవ వికెట్ కు 103 పరుగులు జోడించి ఆదుకున్నారు.
30 బంతుల్లో 44 పరుగులు చేసిన అనుష్క శర్మ అవుట్ అయిన తరవాత కాసేపటికే 41 బంతుల్లో 65 పరుగులు చేసిన గార్డనర్ కూడా అవుట్ అయ్యింది. అయితే ఆఖర్లో వచ్చిన వారెహామ్, ఫుల్మలీ లు బ్యాట్ ఝులిపించారు. వారెహామ్ 10 బంతుల్లో 27 పరుగులు , ఫుల్మలీ 7 బంతుల్లో 14 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది
యూపీ వారియర్స్ ఉమెన్ బౌలర్లలో ఎకిల్ స్టోన్ రెండు వికెట్లు తీసుకోగా శిఖా పాండే, డాటిన్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు

