పుష్ప-2 అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నెలకొల్పిన రికార్డు ను లేటెస్ట్ హిందీ చిత్రం ‘దురంధర్’ బద్దలు కొట్టింది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 5 నే విడుదల అవడం విశేషం. 2024 డిసెంబర్ 5 న పుష్ప-2 విడుదలవగా, 2025 డిసెంబర్ 5 న దురంధర్ విడుదల అయ్యింది
831.40 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని జియో స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. 33 వ రోజు, మంగళవారం నాడు దురంధర్ 5.7 కోట్ల నెట్ వసూళ్లు సాదించినట్లుగా జియో స్టూడియోస్ ప్రకటించింది. ఇప్పటికే ఒకే భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే
సైలెంట్ గా వచ్చి ఒకే భాషలో విడుదలై, గల్ఫ్, పాకిస్థాన్ వంటి దేశాలలో నిషేధించినా దురంధర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దురంధర్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. పుష్ప-2 ఫుల్ రన్ వసూళ్లను దురంధర్ 33 రోజుల్లోనే కొల్లగొట్టింది. లాంగ్ రన్ లో దురంధర్ 900 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది ట్రేడ్ పండితులు చెపుతున్న మాట
దురంధర్ ఇండియా బాక్స్ ఆఫీస్ బ్రేకప్
• మొదటి వారం : 218.00 కోట్లు
• రెండవ వారం : 261.50 కోట్లు
• మూడవ వారం : 189.30 కోట్లు
• నాలుగవ వారం : 115.70 కోట్లు
• ఐదవ వారం : 46.9 కోట్లు ( ఐదు రోజులకు)
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా లు నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యుగంధర్ చిత్రానికి దర్శకుడు ఆదిత్య ధర్.
దురంధర్ పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు


