యాషెస్ సిరీస్ ఐదవ టెస్ట్ : గెలుపు ముంగిట్లో ఆస్ట్రేలియా

by | Jan 7, 2026 | వార్తలు

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న ఐదవ టెస్ట్ లో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 567 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 138 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెబ్ స్టర్ వన్ డే తరహాలో ఆడి 87 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 163 పరుగులతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ చక్కటి పునాది వేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్, టంగ్ లు చెరో మూడు వికెట్లు తీయగా, స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. జాక్స్, బెథెల్ లు చెరో ఒక వికెట్ తీశారు.

అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
యువ ఆటగాడు జాకబ్ బెథెల్ సెంచరీ చేయడమే కాకుండా 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. డకెట్ 42 పరుగులు, బ్రూక్ 42 పరుగులు చేసి అవుట్ అయ్యారు. విల్ జాక్స్ డక్ అవుట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రూట్ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో వెబ్ స్టర్ 3 వికెట్లు తీయగా, బొలాండ్ రెండు వికెట్లు తీశాడు. స్టార్క్, నెజర్ లు చెరో ఒక వికెట్ తీశారు.

ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో రెండే వికెట్లు ఉన్నాయి. ఐదవ రోజు ఏదో అద్భుతమే జరిగితే తప్ప ఇంగ్లాండ్ కు ఓటమి తప్పేలా లేదు.