ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ Ok. చిరు ఇంట్రడక్షన్ సాంగ్ ఎప్పుడు?

by | Jan 5, 2026 | సినిమా

‘మన శంకర వర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad garu)  చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో ఎస్ వి సినీప్లెక్స్ లో జరిగింది.  ట్రైలర్ చివర్లో వెంకటేష్, చిరంజీవి ల మధ్య సంభాషణలు మంచి హైప్ ని తీసుకు వచ్చాయి.  మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్  అవుతోంది. 

మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7 న హైదరాబాద్ లో జరగనుంది.  ఈ ఈవెంట్ కు మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పేరు పెట్టారు.  ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఇద్దరు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటిదాకా ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల చేశారు.  చిరంజీవి (Chiranjeevi) ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం విడుదల చేయలేదు.  బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉంది.   మెగాస్టార్ చిరంజీవి, ఆట సందీప్ ని పిలిచి ఈ  పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు.  తన అభిమాన హీరో కు సందీప్ ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేశారని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు.  జనవరి 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  జనవరి 11 రాత్రి నుండి ప్రీమియర్ సందడి మొదలవుతోంది.