యాషెస్ టెస్ట్ సిరీస్ (Ashes Test Series) లో ఈ రోజు ప్రారంభమైన ఐదవ టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England) జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్ జట్టు 57 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల లోటు కష్టాల్లో పడింది. ఓపెనర్ క్రాలే 16 పరుగులు, డకెట్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన బెథెల్ కూడా 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును జో రూట్, హరీ బ్రూక్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 154 పరుగులు జోడించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రూట్ 72 పరుగులతో, బ్రూక్ 78 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, నెజర్, బొలాండ్ లు తలా ఒక వికెట్ తీశారు.
అయితే మొదటి రోజు కేవలం 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది.
ఐదు మ్యాచ్ ల యాషెస్ టెస్ట్ సిరీస్ ను ఇప్పటికే 1-3 కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది

