1987 లో పుష్పక విమానం అనే మూకీ సినిమా వచ్చింది. కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సినిమా లో ఒక్క మాట కూడా లేకపోయినా ప్రేక్షకుడిని కుర్చీలో నుండి కదలకుండా కూర్చోబెట్టిన ఘనత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు
మళ్ళీ 38 సంవత్సరాల తరవాత మాటలు లేకుండా ‘గాంధీ టాక్స్’ అనే సినిమా వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరీ, సిద్ధార్ద్ జాదవ్ లు నటించారు. ఏ ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించారు. జీ స్టూడియో.
మహాత్మ గాంధీ వర్ధంతి రోజు అయిన జనవరి 30 న ఈ గాంధీ టాక్స్ చిత్రాన్ని జీ స్టూడియో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ బాషలలో విడుదలవుతోంది.
రఘుపతి రాఘవ రాజారాం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి కిశోర్ పి బేలేకర్ దర్శకుడు.

