తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయకుడు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కె వి యెన్ ప్రొడక్షన్ పతాకంపై, వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాబి డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా మమిత బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తమిళంలో జన నాయగన్ పేరుతో, హిందీలో జన నేత గా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ రోజు జన నాయకుడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా బాల కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు ఫ్రీమేక్ అని ట్రైలర్ చూస్తే చెప్పవచ్చు.
జన నాయకుడు తెలుగు, తమిళం, హిందీ బాషలలో జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్ కు జన నాయకుడు ఆఖరి చిత్రం అని ఇప్పటికే ప్రకటించారు

