ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా రాజాసాబ్. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాటలు వింటే ప్రభాస్ అందరికి ఎందుకు డార్లింగ్ అయ్యాడో తెలుస్తుంది
ప్రభాస్ మాట్లాడుతూ సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి అని అన్నాడు. అంతే కాకుండా ప్రభాస్ మాట్లాడుతూ ‘సీనియర్ సీనియరే. సీనియర్స్ దగ్గర్నుంచి మేము నేర్చుకున్నది. సీనియర్స్ తరవాతే మేము. 100%.’. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా బ్లాక్ బస్టర్ అయితే హ్యాపీ అన్నాడు.
సహజంగానే ప్రభాస్ అందరికి డార్లింగ్. సినిమా షూట్ లో టీం అందరికి ఇంతో భోజనం ఏర్పాటు చేస్తాడు అని చాల మంది చెప్పగా విన్నాము. ఇప్పుడు సీనియర్ హీరో ల పట్ల తనకున్న గౌరవాన్ని తన స్పీచ్ తో మరో సారి వెల్లడి చేశాడు. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయినా ప్రభాస్ కు’ కొంచెం కూడా గర్వం లేకపోవడం అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో ప్రభాస్ నుండి స్ఫూర్తి పొందవచ్చు.
ఇది అల్లు అర్జున్ లాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోలు కూడా ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి. ఒక్క సినిమా హిట్ అయితే మనల్ని కొట్టేవాడు లేదు అనుకోకూడదు. భారీగా టికెట్ లు పెంచి, థియేటర్ లో వేరే ఏ సినిమాలు లేక విడుదల చేసిన పుష్ప 2 భారీగా వసూళ్లు సాధించడం గొప్ప కాదు. పుష్ప 2 వసూళ్లు ఆరేళ్ళ క్రితమే ప్రభాస్ సాధించాడు.
ప్రభాస్ సినిమా అంటేనే మినిమం 500 కోట్లు, హిట్ అయితే 1000 కోట్లు, బ్లాక్ బస్టర్ హిట్ అయితే 1500 కోట్లు అనే రేంజ్ కి వెళ్లిన ఏ మాత్రం గర్వం లేని హీరో మన డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ (Darling Prabhas) రాజా సాబ్ సినిమా ఈ సంక్రాంతికి అంటే జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రగడ టీవీ వారు డార్లింగ్ ప్రభాస్ కు, రాజా సాబ్ (Raja Saab) టీం తన విషెస్ తెలియ చేస్తోంది

