యాషెస్ సిరీస్ నాలుగవ టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం

by | Dec 27, 2025 | వార్తలు

యాషెస్ సిరీస్ లో భాగంగా  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న ప్రారంభమైన నాలుగవ టెస్ట్ లో  నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.  ఇప్పటికే మొదటి మూడు టెస్ట్ లు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగవ టెస్ట్ లో విజయం కొంత ఊరట కలిగిస్తుంది.  ఈ టెస్ట్ కూడా రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. మొదటి రోజు ఆటలో 20 వికెట్లు, రెండవ రోజు ఆటలో 16 వికెట్లు నేలకూలాయి ఈ మ్యాచ్ లో

మ్యాచ్ మొత్తంగా 7 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ పేసర్ టంగ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

175 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు మంచి శుభారంభమే లభించింది.  ఓపెనర్లు క్రాలే, డకెట్ లు మొదటి వికెట్ కు 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు.  డకెట్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఆ తరవాత లోయర్ ఆర్డర్ నుండి వన్ డౌన్ కు ప్రమోట్ అయినా కార్స్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

క్రాలే తో జత కలిసిన బెథెల్ మూడవ వికెట్ కు 47 పరుగులు జోడించారు.  క్రాలే 37 పరుగులు, బెథెల్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు. రూట్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  బ్రూక్ 18 పరుగులతో అజేయంగా నిలిచాడు 

175 పరుగుల లక్ష్యాన్ని, ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బౌలర్ల లో స్టార్క్, బొలాండ్, రిచర్డ్ సన్ లు చెరో రెండు వికెట్లు తీశారు

అంతకు ముందు, ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో 132 పరుగులకే కుప్ప కూలింది. 46 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.  కెప్టెన్ స్మిత్ 24 పరుగులు, గ్రీన్ 19 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు ఎవరు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు.

ఇంగ్లాండ్ బౌలర్ల లో కార్స్ నాలుగు వికెట్లు తీయగా, స్టోక్స్ 3 వికెట్లు, టంగ్ రెండు వికెట్లు తీశారు. అట్కిన్సన్ కు ఒక వికెట్ దక్కింది.

ఆస్ట్రేలియా బౌలర్ల లో స్టార్క్, రిచర్డ్ సన్ లు చెరో ఒక వికెట్ తీశారు

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే కుప్ప కూలింది.  35 పరుగులు చేసిన మైఖేల్ నెజర్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.

ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ 5 ఐదు వికెట్లు తీసుకోగా,అట్కిన్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.  కార్స్, స్టోక్స్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు

ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు.  ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 110 పరుగులకే కుప్ప కూలింది.

ఇంగ్లాండ్ చేసిన 110 పరుగులలో 41 పరుగులు హరీ బ్రూక్ చేసినవే.  ఇతనే ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ నెజర్ నాలుగు వికెట్లు తీసుకోగా, బొలాండ్ మూడు వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది.