దురంధర్ ప్రభంజనం : వెయ్యి కోట్ల క్లబ్ లో దురంధర్

by | Dec 26, 2025 | వార్తలు

రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ లు నటించిన హిందీ సినిమా దురంధర్ మూడు వారాల తరవాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. 2025 లో వెయ్యి కోట్ల క్లబ్ (గ్రాస్ ) లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సృష్టించింది. కేవలం 21 రోజుల్లో దురంధర్ ఒక భాషలో ఈ ఘనత సాధించింది.

అయితే దురంధర్ సినిమా కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎ సర్టిఫికెట్ తో 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి చిత్రం దురంధర్
మన భారత దేశంలో దురంధర్ 789 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా 668.8 నెట్ వసూళ్లు సాధించింది

ఒరిజినల్ హిందీ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన దురంధర్ ‘స్త్రీ-2 పేరిట ఉన్న రికార్డు ను బద్దలు కొట్టింది. పాకిస్థాన్, Gulf వంటి దేశాలలో ఈ సినిమాను నిషేధించినా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక్క బాషలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. దురంధర్ సినిమా ఇక ముందు మరి ఎన్ని రికార్డు లు సృష్టింస్తుందో చూడాలి.

ఆదిత్య ధర్ ఈ దురంధర్ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు. ఆదిత్య ధర్ గతంలో ఉరి వంటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతనికి ఇది రెండవ సినిమా మాత్రమే.

దురంధర్ పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

దురంధర్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొమ్మిదవ సినిమా. అంతకు ముందు బాహుబలి-2, పుష్ప-2, కెజిఫ్-2, పఠాన్, జవాన్, కల్కి, ఆర్ ఆర్ ఆర్, దంగల్ చిత్రాలు వెయ్యి కోట్ల వసూళ్లను సాధించాయి. ఈ తొమ్మిది చిత్రాలలో మూడు సీక్వెల్ (పార్ట్ 2) లు ఉన్నాయి.