భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గౌహతి లో జరుగుతోన్న రెండవ టెస్ట్ లో లంచ్ విరామ సమయానికి సౌత్ ఆఫ్రికా జట్టు 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసి భారీ స్కోర్ మీద కన్నేసింది.
సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముత్తుసామి తన కెరీర్ లో మొదటి సెంచరీ ని నమోదు చేసుకున్నాడు. మంచి టెక్నిక్ తో ఆడిన ముత్తుసామి 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ కు బౌలింగ్ అల్ రౌండర్ జాన్సెన్ వచ్చాక ఆట స్వరూపం మారిపోయింది. జాన్సెన్ ధాటిగా ఆడుతూ 57 బంతుల్లో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ముత్తుసామి, జాన్సెన్ లు ఎనిమిదవ వికెట్ కు 94 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మొదటి సెషన్ లో ఒక వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లకు, ఎట్టకేలకు రెండవ సెషన్ లో ఒక వికెట్ దక్కింది. ఆ వికెట్ జడేజా తీసుకున్నాడు. 45 పరుగులు చేసిన వేరేయనీ జడేజా బౌలింగ్ లో ఫ్రంట్ ఫుట్ ఆడబోయి స్టెంప్ అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ల పట్టుదల ముందు స్టార్ పేసర్ బుమ్రా కూడా తేలిపోయాడు.
తొమ్మొదవ స్థానంలో బ్యాటింగ్ దిగిన జాన్సెన్ అర్ధ సెంచరీ చేయడం సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ కు ఊపు వచ్చింది. టీ సెషన్ లో ధాటిగా ఆడతారావు లేదా 500 పరుగులకు పైగా చేస్తారా అనేది చూడాలి. టీ విరామం తరవాత వికెట్లు త్వరగా పడగొట్టగా పోతే భారత జట్టు ఈ మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిందేమో.
భారత పిచ్ ల మీద అది కూడా గౌహతి లాంటి కొత్త పిచ్ మీద మన భారత బౌలర్లు తేలిపోయారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పట్టుదలతో ఆడి భారీ స్కోర్ దిశగా వెళుతున్నారు

