ప్రభాస్ నటిస్తోన్న మొదటి హారర్ కామెడీ సినిమా రాజా సాబ్. మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి రెబెల్ సాబ్ అనే ఫస్ట్ సింగల్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు
ఈ పాటకు సంబందించిన ప్రోమో విడుదల చేశారు. ఈ పాటలో చాలా సంవత్సరాల తరవాత వింటేజ్ ప్రభాస్ కనిపించాడు
ఈ పాటను రేపు సాయంత్రం అంటే నవంబర్ 23 సాయంత్రం 6. 11 కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది అగర్వాల్ లో హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
ఈ హారర్ కామెడీ సినిమా రాజా సాబ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

