విజయవాడ రామ్ చరణ్ అభిమానులు 256 అడుగుల భారీ కట్ అవుట్ ను విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ కట్ అవుట్ ని లాంచ్ చేయడానికి దిల్ రాజు విజయవాడ వచ్చారు. 256 అడుగుల భారీ కట్ అవుట్ వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు ని క్రియేట్ చేసింది. ఈ అవార్డు ను దిల్ రాజు అందుకున్నారు
ఈ వేదిక మీద గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల తేదీని జనవరి 1 గా ప్రకటించారు.
అంతే కాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా లెవెల్లో ఆంధ్ర ప్రదేశ్ లో చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఈవెంట్ కు, ముఖ్య అతిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రేపు దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4 లేదా 5 న చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ మీద ఆధారపడి ఉంది.

