2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

by | Dec 31, 2024 | వార్తలు

2024 వ సంవత్సవరం మెగా నామ సంవత్సరం గా చెప్పవచ్చు. మెగా ఫాన్స్ చాలా శుభవార్తలు విన్నారు

మెగా స్టార్ చిరంజీవి : 2024 మే నెల లో కేంద్ర ప్రభుత్వం, భారత పౌరులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ తో మెగా స్టార్ చిరంజీవి ని సత్కరించింది.

2024 అక్టోబర్  నెల లో గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డు రూపంలో వచ్చింది. 143 సినిమాలలో 537 స్టెప్స్ తో మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ట్ అఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు ను అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ : 2024 లో పవన్ కల్యాణ్ నిజమైన పవర్ స్టార్ అయ్యారు.  టీడీపీ, బీజేపీ తో కలిసి కూటమి ని స్థాపించి 2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కూటమి పొత్తు ధర్మంలో భాగంగా 21 ఎం ఎల్ ఏ సీట్లు, 2 ఎంపీ సీట్లలో జన సేన అభ్యర్థులను నిలబెట్టారు.  పోటీ చేసిన ప్రతీ చోట జనసేన అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు.  ఇది ఒక చరిత్ర.  రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ అవతరించిన పార్టీ గ జనసేన చరిత్ర సృష్టించింది.  పవన్ కల్యాణ్ ఎం ఎల్ ఏ అయ్యారు.  ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, పేరుకు తగ్గట్టు గానే వేల్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

ఇక నాగ బాబు, అన్నదమ్ములు (మెగా స్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ల ను ఎవరైనా ఏమైనా అంటే సింహం లో దూకే నాగ బాబు గారికి ఒక రోజు ముందే ఎం ఎల్ సి పదవి ఖాయమైంది. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా 2024 లో విడుదల అవలేదు.  2025 లో మాత్రం మెగా పవర్ గ్లోబల్ స్టార్స్ లైన్ పెట్టి మరి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  మొదటగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదలవుతోంది