సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

by | Dec 31, 2024 | వార్తలు

మన దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది.

మన దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారు.  అయన ఆస్తుల విలువ 931 కోట్లు.  అయితే గత ఎన్నికల సమయం లో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపరచిన వివరాల ప్రకారం, ఇందులో చంద్రబాబు నాయుడు గారు పేరిట 36 కోట్లు ఉండగా, అయన భార్య నారా భువనేశ్వరి గారి పేరు మీద 895 కోట్లు (హెరిటేజ్  ఫుడ్స్ షేర్లతో కలిపి) ఉన్నాయి.  ఒక పది కోట్ల అప్పు కూడా ఉంది.

ఈ జాబితాలో 332 కోట్ల ఆస్తితో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా  ఖండూ రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ఆయనకీ 180 కోట్ల అప్పు కూడా ఉంది

ఇదే జాబితాలో మూడవ స్థానంలో, 51 కోట్ల ఆస్తితో,  కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్దరామయ్య ఉన్నారు.  ఆయనకు 23 కోట్ల అప్పు ఉంది

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తితో జాబితా చివర నుండి రెండవ స్థానం లో ఉన్నారు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 1.18 కోట్ల ఆస్తితో జాబితా చివరనుంది మూడవస్థానంలో ఉన్నారు 

ఆశర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాబితాలో ఆఖరు స్థానంలో ఉన్నారు

రెండవ స్థానం లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  పెమా  ఖండూ ఆస్తికి, మొదటి స్థానం లో చంద్రబాబు ఆస్తులకి ఏ మాత్రం పొంతన లేదు.   

అయితే ముఖ్యమంత్రులందరిలో వ్యాపారాలు ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉన్నారేమో